studio9focus
Spread the love

సింహాచలం : సింహాచలం దేవస్థానం ఉపాలయమైన గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం వార్షిక పండగ తేదీ 15-06-2021 సందర్భంగా ఉదయాన్నే శ్రీఅమ్మవారి ఆరాధన కార్యక్రమం జరిపించారు .

తదుపరి శ్రీ పైడితల్లి అమ్మవారికి మహానివేదన కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయం కవాటబంధనం చేయుట జరిగింది . ఆసమయంలో దేవాలయంకు వచ్చిన కొందరు భక్తులు దేవాలయంను మూసివేసినట్లు భావించి EO సూర్యకళ గారికి తెలియపరిచారు. అందుకు EO గారు తక్షణమే స్పందించి భక్తులకు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించాలని ఆదేశించారు

EO గారి ఆదేశాలమేరకు భక్తులకు నిరంతరం లఘుదర్శనాలు కల్పించారు . శ్రీ అమ్మవారిని దర్శించుకొని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసారు

కరోనా నిబంధనలు పాటిస్తూ సింహాచల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని …దివ్య ఆశీస్సులు పొందారు.

EO గారి ఆదేశాలమేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు దర్శనాలు కల్పించారు..

 

By Anvesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!