Spread the love

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నం లోని బురుజుపేట పరిధిలోకల ప్రసిద్ద దేవాఅలయం.ఇక్కడి అమ్మవారు శ్రీకనకమహాలక్ష్మి విశాఖప్రజల గ్రామదేవతగా వెలుగొందుతున్నది.

ఈ దేవాలయానికి సంబంధించి సరియైన చారిత్రక ఆధారాలులేవు. ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల యొక్క కోట బురుజు కలప్రాంతం అయిన బురుజుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది.

స్థానిక కథనం ప్రకారం, 1912 లో శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మునిసిఫల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విసాఖలో ప్లేగు వ్యాధి ప్రభలి అనేకమంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్ళీ యధాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడటం తరువాత ఆమె యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినది.

విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీకనక మహాలక్ష్మీ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గానీ, గోపురం గానీ ఉండదు. అంతేకాదు, అమ్మవారికి వామ హస్తం (ఎడమ చేయి) కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు.

By Anvesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!