Spread the love

డిఎస్పీ మాధవ రెడ్డి…
ముమ్మిడివరం నగరపంచాయితి
నందు కొందరు వ్యక్తులు పుట్టినరోజు వేడుకలలో భాగంగా కత్తులతో కేక్ ను కట్
చేయుచున్నట్లు, పోలీసు స్టేషన్ ఎదురుగా ఫోటో దిగిన వీడియోలు
హల్చల్ అవుచుండడంతో సదరు విషయంపై ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 16 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు..
15వ తేదీ అర్ధరాత్రి ముమ్మిడివరం నగర పంచాయతీ కి చెందిన
యల్లమిల్లి దుర్గాప్రసాద్( చంటి ) వెంకటేశ్వరరావు
తన పుట్టినరోజు వేడుకను
స్నేహితులతో కలసి ముమ్మిడివరంలో తన ఇంటి ఎదురుగా,తిళ్ళమ్మ చెరువు దగ్గర
కేకునుతో పాటు దసరా చెడి తాలింఖానా లో ఉపయోగించే తల్వార్లతో
కేకు కట్ చేసారు.మార్గ మద్యలో అక్కడక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వీధిలో
వాటితో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అందరూ కోవిడ్ 19 ఉత్తర్వులు
ఉల్లంఘించినట్లు, ఫోటోలు, వీడియోలు ఆదారంగా ఆరోపణలు దర్యాప్తులో రుజువు కావడంతో
శ్రీ తూర్పు గోదావరి జిల్లా SP వారి ఆదేశానుసాలతో నిందితుల ను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు DSP తెలిపారు. ముమ్మిడివరం CI, ముమ్మిడివరం ఎస్ ఐ సిబ్బందితో కలసి
యల్లమిల్లి దుర్గా ప్రసాద్ @ చంటి తోపాటు సదరు ఘటనకు పాల్పడిన 15 మందిని
అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ఒక కారు,4 మోటార్ సైకిళ్ళును,4 తల్వార్లను స్వాధీనం చేసుకున్నమన్నారు . ఘటనకు పాల్పడి, అరెస్టు చేయబడిన 16 మందిని
ముమ్మిడివరం మేజిస్టేట్ కోర్ట్ వారి ముందు హాజరు పరచగా, మేజిస్ట్రేట్
గారు సదరు 16 మందికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడం జరిగిందని మాధవ రెడ్డి తెలిపారు..

By Anvesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!