హైదరాబాద్‌: ‘డెల్టా’ వేరియంట్‌తో పది నెలలుగా కంటిమీద కునుకు లేకుండా గడిపిన సిటిజన్లు.. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌తో మళ్లీ వణికిపోతున్నారు. ఎప్పుడూ ఎటు నుంచి ఏ రూపంలో వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సోమవారం సంగారెడ్డి గురుకులంలోని 42 మంది విద్యార్థులకు కోవిడ్‌ నిర్ధారణ కావడంతో నగరంతో పాటు శివారు జిల్లాల్లోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ 18 ఏళ్లలోపు వారికి టీకాలు అందుబాటులోకి రాకపోవడం, కాలేజీలు, స్కూళ్లు, హాస్టళ్లు పూర్తిస్థాయిలో పని చేస్తుండటం, భౌతిక దూరం పాటించకపోవడం, 40 నుంచి 60 మంది విద్యార్థులను ఒకే చోట కూర్చోబెడుతుండటంతో తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *