కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ భారత్‌లో ప్రవేశించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే, సింగపూర్‌, కెనడా నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారందరని ఐసోలేషన్‌లో ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *