studio9focus
Spread the love

కోల్‌కతా: సమఖ్య వ్యవస్థలో రాష్ట్రాల మధ్య సహాయసహకారాలు ఉండాలని, ఏదైనా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే మిగతా రాష్ట్రాలు అండగా నిలబడగలిగే పరిస్థితులు ఉండాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బుధవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ”ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాష్ట్రాలన్నీ ఏకం కావాలి. బీజేపీయేతర రాష్ట్రాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ దుర్మార్గాలను అడ్డుకోవాలంటే ఇది తప్పదు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం కొనసాగాలి. ఏదైనా రాష్ట్రం ఇబ్బందికి గురైనా, ఏదైనా రాష్ట్రంపై దాడి జరిగినా మిగతా రాష్ట్రాలన్ని వెంటనే స్పందించి అండగా నిలబడగలిగే వాతావరణం ఉండాలి. సమాఖ్య వ్యవస్థలో ఇది చాలా అవసరం” అని మమతా బెనర్జీ అన్నారు.

By Anvesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!