studio9focusNews
Spread the love

విజయవాడ: రాష్ట్రంలోని మరింత మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందించి వారిని రైతు భరోసా పథకానికి అర్హులు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ ఉన్నతాధికారులను మంత్రి కన్నబాబు ఆదేశించారు. 2021 ఖరీఫ్ కోసం రాయితీపై విత్తన సరఫరా, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రుణాలు, వైఎస్సార్ పొలం బడి, వేరుశెనగ విత్తనాల పంపిణీ, తదితర అంశాలపై జిల్లాల వారీగా మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉన్నతాధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో ఖరీఫ్ సన్నద్ధ సమావేశాన్ని వ్యవసాయ మంత్రి కన్నబాబు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పంటల ప్రణాళికలకు ఈ ఏడాది నుంచి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. క్రాప్ ప్లానింగ్, ప్రాంతాల వారీగా ఏఏ పంటలకు సానుకూలత, ప్రతికూలత, ప్రత్యామ్నాయ పంటలు, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని వారికి ఆయన సూచించారు.

By Anvesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!