studio9focus
Spread the love

న్యూఢిల్లీ: టీవీలో క్రికెట్ దిగ్గజం సచిన్​ టెండూల్కర్​ ఆటను చూసి కళాత్మక స్ట్రైట్​ డ్రైవ్​తో పాటు బ్యాక్​ఫుట్​ షాట్లు నేర్చుకున్నానని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఓ మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఫుట్‌వర్క్ మెరుగుపరుచుకోవడానికి మన్సూర్ అలీఖాన్ పటౌడీ, సునీల్ గవాస్కర్, శ్రీకాంత్ సాయం చేశారని గుర్తు చేసుకున్నాడు.

‘1992 ప్రపంచకప్​తో నేను టీవీలో క్రికెట్ చూడటం ప్రారంభించాను. అప్పుడే సచిన్​ ఆడుతున్న స్ట్రైట్​ డ్రైవ్​ను నేర్చుకున్నా. ఈ రోజుల్లో యువ ఆటగాళ్లకు చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల క్రికెట్​ షాట్లను తెలుసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సౌకర్యాలు మా రోజుల్లో ఉంటే నేను త్వరగానే భారత జట్టుకు ఎంపికయ్యేవాడిని.”అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

By Anvesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!