studio9focus
Spread the love

హైదరాబాద్: కరోనా సంక్షోభం సమయంలోనూ తెలంగాణ వ్యాప్తంగా నిబద్దతో విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖలో కరోనా కేసులు కల్లోలం రేపుతున్నాయి. తీవ్ర భయాందోళనలమధ్య వారు విధులకు హాజరవుతున్నారు. సెకండ్ వేవ్‌లో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిషనరేట్‌లు, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర విభాగాల్లో వేలాదిమంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 మందికిపైగా వివిధ స్థాయిల్లో పోలీసులు కరోనాతో మృతిచెందినట్లు సమాచారం. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. అయితే నిఘా విభాగం ద్వారా రోజువారి వివరాలు సేకరిస్తున్న అధికారులు లెక్కలు బహిర్గతం కాకుండా జాగ్రత్తపడుతున్నారు.

By Anvesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!